Tuesday, February 10, 2009

నా బ్లాగ్ స్పాట్ యిస్టొరీ చెబ్తున్నా ..వినుండ్రి..

ఇన్ల చెప్పనీకి ఏముంది భై ...

ఒక ఎం.ఎన్.సి సాఫ్టువేర్ కంపిన్ల పని జేస్తున్న అని జెప్పిన గద..ఇగ మీకు తెల్వందేముంది.. వుంటేనేమో మస్త్ పనుంటది ..మల్ల మెసలకుంట.. షెడ్యూల్స్ అని.. డెడ్ లైన్స్ అని.. టార్గెట్ లని.. మస్త్ పంజేపిస్తారు.. ఇగ లేకపోతేనేమో అస్సలుండదు.. ఒగాల వున్నా రోజుకో గంటో, రెండు గంటలో వుంటది .. మరి మిగిలన టైమంత ఏం జేయ్యాలీ?

అరె ఎన్ని చాయ్ లని తాగుతం భై .. ఎంత సేపని కాఫెటేరియాల దోస్త్ లతోటి బాతకానీలు గొట్టుకుంట కూసుంటం.. ఎంత సేపని మెయిల్స్ చెక్ జేస్తం.. అరె పేపర్లు , వెబ్ సైట్లు ఎంత సేపని సద్వుతం భై.. పోనీ ఇంకో కంపిన్లకు జంప్ కొడ్తమా అంటే.. వామ్మో మీకు తెల్వందేముంది .. ఫైనాన్సియల్ క్రైసిస్ అంట.. ఎకనామికాల్ రేసేస్షన్ అంట.. మనం ' ఆర్ధిక మాంద్యం ' అంటం గదా .. హాన్ గదే .. నిల్వున ముంచింది అన్ని ఫీల్డ్ లను .. ఇగ దాంట్లో ఐటి / సాఫ్టువేర్ ఫీల్డ్ ల గురించి ఇస్పెషల్ గ జెప్పాల్నా.. ఏ పేపర్ల , ఏ టి వి ల జూసినా తెలుస్తది.. పింక్ స్లిప్ లనీ.. సాలరీ డిక్రిమేంట్ లనీ.... వామ్మో గిలాంటి టైం ల ఏడ జంప్ జేసేది.. అందుకనే గా కోషిష్ గూడ జేయ్యట్లేదు..

మరి మస్త్ ఖాళీ టైం ఉంటది.. కాళీగా గూసుంటే నేమో దిమాక్ కరాబ్ అయితది ... పోనీ..ఏ జావా నో , కోవా నో సద్వుదామా అంటే.. గంతోపిక మనకేడుంటధీ .. మరేం జెయ్యాల? ఏం సమజైత లేదు..ఇగ బాగ సొంచా ఇంచిన ..సొంచా ఇంచినా.. అంతే ..లటక్కున ఈ బ్లాగ్ స్పాట్ బాగోతం యాద్ కొచ్చింది .. అరె మనం గూడ ఒక బ్లాగ్ శురూ జేస్తే మంచిగుంటది గదా అని.. మంచిగనే వుంటది గని , మరి బ్లాగుకేం పేరు పెట్టాలి ? మల్లిదో పరేషాన్.. మళ్ళా సొంచా ఇంచిన.. ఆకరికి ఈ ' తెలంగాణా పోరగాడు ' అనే పేరు సెలెక్ట్ జేసి, బ్లాగ్ శురూ జేసిన..

అసలే ఇది ఏ. పి ల ఇది ఎలచన్ టైం గదా .. ఇగ జూస్కోరి , మస్త్ మతలబ్ లు పోస్ట్ జేస్తా..

ఏందన్నా .. నవ్వుతానావ్ ? ఏం మంచిగ లేదా? ఐతే నెక్స్ట్ టైం ఇంక జేర్రంత మంచిగ రాయనీకి కోషిష్ జేస్తలే.. ఇప్పటికైతే వుంటా మరి.. మా టీం లీడ్ ఎందుకో పిలుస్తుండు..

ఇట్లు..

మీ తెలంగాణా పోరగాడు........... ఎంకర్రెడ్డి

4 comments: